కొలంబోలో పేలుళ్లు : జగిత్యాల వాసులు క్షేమం

  • Publish Date - April 22, 2019 / 01:14 AM IST

పవిత్ర ఈస్టర్‌ వేళ (ఏప్రిల్ 21 ఆదివారం) శ్రీలంకలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 215 మంది మృత్యువాత పడ్డారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు భారతీయులు మృతి చెందారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన టూరిస్ట్‌లు బాంబు బ్లాస్ట్‌ల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అనంతపురం, జగిత్యాల జిల్లా వాసులు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.

తెలంగాణలోని జగిత్యాల జిల్లా వాసులు బాంబు పేలుళ్ల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మెట్‌పల్లి, కోరుట్ల వాసులు శ్రీలంక టూర్‌కు వెళ్లారు. అయితే షెడ్యూల్‌ ప్రకారం వీరు ఆదివారం ఉదయం 8 గంటలకే కొలంబో నుంచి ఇండియాకు బయలుదేరారు. వీరు బయలుదేరిన గంటన్నరకు బాంబు పేలుళ్లు జరిగాయి. దీంతో వారంతా క్షేమంగా బయటపడ్డారు.
రాత్రి 8 గంటలకు వారంతా ఇంటికి చేరుకున్నారు.

మరోవైపు మంగళూరు సమీపంలోని బైకంపాడికి చెందిన 58 ఏళ్ల రెజీనా ఖాదర్‌ బాంబ్‌ బ్లాస్ట్‌లో మృతి చెందారు. రెజీనా పూర్వీకుల స్వస్థలం శ్రీలంక. అక్కడ ఎక్కువ మంది బంధువులు ఉండటంతో…శుభకార్యానికి వెళ్లారు. అంతలోనే ఆమె బాంబ్‌ బ్లాస్ట్‌లో మృతి చెందారు. దీంతో వారి కుటుంబసభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ట్రెండింగ్ వార్తలు