ముఖ్య గమనిక : జనసేన గుర్తు మారింది

  • Publish Date - April 25, 2019 / 02:07 AM IST

తెలంగాణలోని జనసేన పార్టీకి రెండు గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. త్వరలోనే ZPTC, MPTC ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది. దీనితో రాష్ట్ర ఎన్నికల సంఘం జనసేనతో పాటు..మూడు పార్టీలకు కామన్ గుర్తులను కేటాయించింది. జడ్పీటీసీకి గాజు గ్లాసు, ఎంపీటీసీకి బ్యాట్ గుర్తులుగా లభించనున్నాయి. రిజర్వుడ్ గుర్తు అంటూ ఉండని పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద నమోదై ఉన్నా..వాటి అభ్యర్థులకు ఇతర స్వతంత్ర అభ్యర్థుల మాదిరిగానే వేర్వేరు స్థానాల్లో వేర్వేరు గుర్తులు లభిస్తుంటాయి. 

ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ప్రత్యేకించిన స్వేచ్చా చిహ్నాల నుండి తమ అభ్యర్థులందరికీ ఒకే గుర్తును ఇవ్వాలని ఆయా పార్టీలు కోరుతుంటాయి. ఇలా జనసేన, తెలంగాణ జనసమితి, సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్, మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీలు కోరాయి. దీంతో ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది.