మలేషియన్ టౌన్‌షిప్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి జేఎన్టీయూ వరకు 1.20 కిలో మీటర్ల పోడవున నిర్మించిన కేపీహెచ్‌బీ ఫ్లై ఓవర్‌ను శనివారం ఉదయం ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ప్రారంభించారు.
హైదరాబాద్: మలేషియన్ టౌన్‌షిప్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి జేఎన్టీయూ వరకు 1.20 కిలో మీటర్ల పోడవున నిర్మించిన కేపీహెచ్‌బీ ఫ్లై ఓవర్‌ను శనివారం ఉదయం ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ప్రారంభించారు. 97 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు వారం రోజుల క్రితం పూర్తయ్యింది. ట్రాఫిక్ రద్దీ దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవర్ ప్రారంభించాలని నగరప్రజలు కోరడంతో ఏ విధమైన హంగు, ఆర్భాటం లేకుండా నేడు ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించే అవకాశం ఒక మహిళకు దక్కింది. మొట్ట మొదటిగా ఆమె తన కారును నడుపుతూ ఈ ఫ్లై ఓవర్ పై ప్రయాణించారు.
Read Also : వైసీపీ హామీ : జగన్ వస్తే కొత్త జిల్లాలు ఇవే
నిత్యం రద్దీగా ఉండి, లక్షలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో నిర్మాణం పూర్తి అయినప్పటికీ ఇంకా ప్రారంభించకపోవడంతో, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా…. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్, ఈ-మెయిల్స్ ద్వారా నెటిజన్లు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున నిర్మాణం పూర్తి అయిన ఈ ఫ్లైఓవర్‌ను అధికారికంగా ప్రారంభించడానికి అధికారులు నిరాకరించారు. అధికారికంగా కాకపోయిన ఈ ఫ్లైఓవర్‌ను వెంటనే రాకపోకలకు అనుమతి ఇవ్వాలని వందలాది మంది సామాజిక మాద్యమాల వేదిక ద్వారా తిరిగి విజ్ఞప్తి చేసారు.
దీంతో ఈ ఫ్లై ఓవర్ ను నేడు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. నిజాంపేట్, ప్రగతి నగర్, కూకట్‌పల్లి నుండి హైటెక్ సిటీకి ఇరువైపులా రోజుకు దాదాపు లక్షా అరవై వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో కూకట్‌పల్లి రాజీవ్ గాంధీ విగ్రహం నుండి మలేషియన్ టౌన్‌షిప్ మీదుగా హైటెక్ సిటీ వేళ్లే లక్షలాది మంది నగర వాసులు సాఫీగా, సులభంగా ప్రయాణం చేసే సౌలభ్యం కలిగింది.
JNTU- MalaysianTownship flyover or aka Rajiv Gandhi Statue Flyover opened for public.. the honour of driving first car goes to this madam ?… congrats madam ??? pic.twitter.com/qBIZjfQDr4
— Arvind Kumar (@arvindkumar_ias) April 6, 2019