వాతావరణం మారడంతో ఒక్కసారిగా రోగాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇటీవల డెంగీ కారణంగా ఓ డాక్టర్ చనిపోవడం సంచలనం కాగా ఇప్పుడు ఓ న్యాయమూర్తి డెంగీ కారణంగా చనిపోయారు.
డెంగీ జ‍్వరం కారణంగా ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆమె చనిపోయారు. జయమ్మ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె గత సంవత్సరం డిసెంబర్‌లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ట్రాన్స్‌ఫర్ అయ్యారు.