ఏం జరిగింది : ఆత్మహత్యకు ముందు ఇంట్లో కోడెల ఏం చేశారు

  • Publish Date - September 16, 2019 / 10:02 AM IST

కోడెల శివప్రసాదరావు ఇంట్లో ఉరివేసుకోవటం, బసవతారకం ఆస్పత్రిలో చనిపోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపొంది. ఇంట్లో ఉరి వేసుకోవాల్సి అవసరం ఏంటీ..? ఎందుకు ఇలా జరిగింది అనే విషయాలు సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. దీంతో ఈ కోడెల మృతిపై రాజకీయంగా కూడా చర్చ మొదలైంది. ఆత్మహత్యాయత్నానికి ముందు ఇంట్లో ఏం జరిగింది అనేది మిస్టరీగా మారింది.

అసెంబ్లీ ఫర్నిచర్ విషయం, కె.ట్యాక్స్ వంటి ఆరోపణలపై విమర్శలు, వరసగా నమోదు అవుతున్న కేసుల విషయంలో త్రీవ మనోవేదనకు గురైన కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే 15రోజుల క్రితం నరసరావుపేట ఆస్పత్రిలో కోడెల చేరారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత హైదరాబాద్ లోని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న ఆయన సడెన్ గా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి తలనొప్పిగా చెప్పి రెస్ట్ తీసుకునేందుకు ఇంట్లో ఉన్న కుమార్తెకు చెప్పి మేడ మీదకు వెళ్లిన కోడెల రూమ్ లోకి వెళ్లిన తర్వాత గడి పెట్టుకుని తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తుంది. కోడెల పడుకునేందుకు ఎప్పుడు రూమ్ లోకి వెళ్లినా డోర్ కి గడి పెట్టుకోరు.

అయితే ఈరోజు మాత్రం లోపలికి వెళ్లి గడి పెట్టకోవడంలో ఆయనతో పాటు ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి డోర్ కొట్టగా ఆయన తలుపు తీయలేదు. దీంతో తలుపులు పగుల గొట్టి వెంటనే బసవతారకం ఆస్పత్రికి తరలించారు.