ఏపీలో వచ్చేది జగన్ ప్రభుత్వమే : కేటీఆర్ జోస్యం

  • Publish Date - February 23, 2019 / 10:04 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే చెప్పేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని గొంతులు చించుకుంటున్న టీడీపీకి.. అంత సీన్ లేదని తేల్చిపారేశారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైఎస్ జగన్ అంటూ కుండబద్దలు కొట్టేశారు. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్ర, జాతీయ అంశాలపై మాట్లాడారు.

తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ స్పందించారు. ఐదో ఎమ్మెల్సీ స్థానం గెలుస్తామని.. తగిన సంఖ్యా బలం ఉందని స్పష్టం చేశారు. అన్ని లెక్కలు చూసే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం కోల్పోతామన్న భయం కాంగ్రెస్‌లో నెలకొందన్నారు.
Read Also: హక్కులను కాలరాస్తున్నారు: కేంద్రంపై కేసీఆర్ గుస్సా

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపడుతామని వెల్లడించారాయన. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లినా.. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికలు రాహుల్ Vs మోడీగా జరిగేలా లేవని అభిప్రాయపడ్డారు. పుల్వామా ఘటన బీజేపీ వైఫల్యంగా అభివర్ణించాయన. ఈ విషయాన్ని రాజకీయం చేయదల్చుకోలేదన్నారు. జాతీయ పార్టీలు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.

ఏపీలో జరిగే అసెంబ్లీలో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడం కల్లే అన్నారు. ఢిల్లీలో కాకుండా ఏపీలో బాబు చక్రం తిప్పాలని చురకలు అంటించారు. టీడీపీ నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి.. టీఆర్ఎస్  పంపుతున్నట్లు విమర్శలు చేయడం విడ్డూరం అన్నారు.
Read Also: బాలకృష్ణ తప్పు అదేనట.. వర్మ పెట్టిన సంచలన వీడియో!

ఏపీ రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటే మాకేంటని.. టీఆర్ఎస్ కు వచ్చే లాభం – నష్టం ఏమీ లేదన్నారు. ఇలాంటి చౌకబారు విమర్శలు చేయటం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి మేం చెబితే ఎలా వెళతారో అర్థం కావటం లేదంటూ.. టీడీపీ నేతల విమర్శలను కొట్టిపారేశారు కేటీఆర్.
Read Also: నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారు