హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.దేశంలో రైతుల తమ అప్పులు మాఫీ చేయమని వేడుకుంటుంటే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్ధిక నేరగాళ్ళ అప్పులు మాఫీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశాన్ని రెండుగా విభజిస్తున్నారని ఆయన అన్నారు. ధనికుల భారత్, పేదల భారత్ గా మార్చారని రాహుల్ అన్నారు.
Read Also : మహిళా రిజ్వరేషన్‌పై రాహుల్ కీలక ప్రకటన
అధికారంలోకి వచ్చే ముందు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసంచేశారని, ఉద్యోగాల్లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారని రాహుల్ చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంలో నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నారని, నోట్లరద్దు,జీఎస్టీకి కేసీఆర్ మద్దతు తెలిపారని ఆయన అన్నారు.
నరేంద్ర మోడీ రాఫెల్ కుంభకోణంతో అనిల్ అంబానీ కి వేల కోట్ల రూపాయలు దోచి పెట్టారని ఆరోపించారు. రాఫెల్ స్కాంపై విచారణ చేయాలని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరని ఆయన అడిగారు. రూ.526 కోట్లతో తయారయ్యే రాఫెల్ యుధ్దవిమానాన్ని రూ.1600 కోట్లకు పెంచారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భారత్ లోని పేదవాళ్ల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులేస్తామని రాహుల్ తెలిపారు.
Read Also :అయోధ్య సమస్య మధ్యవర్తులతో తేలదు : ఆ ఒక్కటే పరిష్కారం