ప్రియాంక రెడ్డి హత్య కేసులో మరో అరెస్ట్

  • Publish Date - November 30, 2019 / 02:35 PM IST

పశువుల డాక్టర్ ప్రియాంక రెడ్డిని కిరాతకంగా పశువులాగా హత్య చేసిన మహ్మద్‌ ఆరిఫ్‌ పని చేసే లారీ యజమాని శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీనివాస్‌ రెడ్డి దగ్గర ప్రధాన నిందితుడు ఏ1 మహ్మద్‌ ఆరిఫ్‌ లారీ డ్రైవర్‌గా పనిచేయగా.. మహ్మద్ గురించిన సమాచారం మరింత తెలుసుకునేందుకు అతనిని అరెస్ట్ చేశారు.

భారీ ఉద్రిక్తతల మధ్యలో పోలీసులు హంతకులను చర్లపల్లి జైలుకు తరలించారు. గట్టి బందోబస్తు మధ్య నిందితులను పోలీస్ వాహనాల్లో తరలించారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు వాహనాలకు అడ్డుగా వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో వాహనాలపై రాళ్లు విసరగా కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే నిందితులు గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే నిందితులకు దగ్గర వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.