బంగాళాఖాతంలో అల్పపీడనం : నేడూ వర్షాలు

  • Publish Date - April 22, 2019 / 12:53 AM IST

బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఏప్రిల్ 26వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తరువాత అది వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఛత్తీస్ గడ్‌పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని..దీని నుండి విదర్భ, మరఠ్వాడాల మీదుగా ఉత్తర కర్ణాటక వరకూ మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 22వ తేదీ సోమవారం అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం 96 ప్రాంతాల్లో వానలు కురిశాయి. అత్యధికంగా రాజేంద్రనగర్‌లో 52.8, ఐజ 13.5, ఎదులగుట్టపల్లి 12.5, నల్లవెల్లి 10.5, బెల్లంపల్లిలో 11.5మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు.