రాజ్ నాథ్ సింగ్‌కు కేటీఆర్ ట్వీట్ : కంటోన్మెంట్ రోడ్లను తెరిపించాలి

  • Publish Date - September 19, 2019 / 03:01 AM IST

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్ రోడ్లను తెరిపించాల్సిందిగా కోరారు. రహదారులను మూసివేయడం బాధాకరమన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. రోడ్లను మూసివేయడం వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నరని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నపాలు చేస్తున్నా స్పందించడం లేదని తెలిపారు. రక్షణ మంత్రిగా మీరు వెంటనే స్పందించి తెరిపించేలా చూడాలని కోరారు. గ్రీన్ సైనిక్ పురి కాలనీ వాసుల సంఘం కంప్లయింట్‌తో మంత్రి కేటీఆర్ ఈ విజ్ఞప్తి చేశారు. ముందస్తు సమాచారం లేకుండా రోడ్లను మూసివేశారని తెలిపింది. 

Read More : పాతబస్తీలో హైటెన్షన్ : రెండు వర్గాల మధ్య ఘర్షణ
వలేరియన్ గ్రామర్ స్కూల్ ప్రాంతంలో సాధారణ పౌరులు వెళ్లకుండా కంటోన్మెంట్ అధికారులు రోడ్డును మూసివేశారు. పౌరులు మరోసారి అనాథలుగా మారారని గ్రీన్ సైనిక్ పురి ట్రీట్ చేసింది. రక్షణ శాఖ నుంచి ఖచ్చితమైన ఆదేశాల మేరకు తాము రోడ్డును మూసివేయించడం జరిగిందని కంటోన్మెంట్ అధికారులు అంటున్నారు. భద్రత పేరిట రోడ్లను మూసివేస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రహదారులపై రాకపోకలను నియంత్రించే వారు.