తెలుగు స్టేట్స్ : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Publish Date - February 18, 2019 / 01:24 PM IST

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనితో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం సాయంత్రం ఈసీ దీనికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 

షెడ్యూల్ డిటైల్స్ : 

ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల 
ఫిబ్రవరి 28న నామినేషన్లకు చివరి తేదీ. 
మార్చి 1వ తేదీన నామినేషన్ల పరిశీలన. 
మార్చి 5వ తేదీన నామినేషన్లకు చివరి గడువు.
మార్చి 12న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్. 
మార్చి 12న సాయంత్రం 5గంటలకు కౌంటింగ్.
మార్చి 15 నాటికి ముగియనున్న ఎన్నికల ప్రక్రియ.