జవాన్లకు సంతాపం : పుట్టినరోజు వేడుకలు రద్దు చేసిన సీఎం కేసీఆర్

  • Publish Date - February 15, 2019 / 05:21 AM IST

కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన 44 మంది జవాన్లకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇది దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాశ్మీర్ లో జవాన్లపై దాడితో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, ఈ సమయంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించటం భావ్యం కాదన్నారు కేసీఆర్.  ప్రభుత్వం, పార్టీ పరంగా నిర్వహించాలని నిర్ణయించిన.. అన్ని కార్యక్రమాలను రద్దు చేయాలని ఆదేశించారు.

దేశం విషాధంలో ఉన్నప్పుడు వేడుకలు చేసుకోవటం భావ్యం కాదని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ దాడితో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 17న పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి ఉత్సవాలు జరుపుకోరాదని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని కూడా అభ్యర్థించారు.