My Home Vyoma: నానక్‌రామ్‌గూడలో ‘మై హోమ్ వ్యోమా’.. 22 ఎకరాల్లో అల్ట్రా లగ్జరీ ఇళ్లు.. ఎయిర్‌పోర్ట్‌, ఐటీ హబ్స్, ప్రైమ్ ప్లేసెస్ కి సమీపంలో

'మై హోమ్ గ్రూప్' అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘మై హోమ్ వ్యోమా’ (My Home Vyoma) ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

My home vyoma launched in nanakramguda gachibowli hitech city financial district

My Home Vyoma: వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల నివాస అభిరుచులు గణనీయంగా మారుతున్నాయి. ఇల్లు అంటే కేవలం ఉండే స్థలం మాత్రమే కాక, అది ఒక హోదాకు, ప్రశాంతమైన అనుభూతికి ప్రతీకగా నిలుస్తోంది. నాలుగు దశాబ్దాల నమ్మకమైన చరిత్ర ఉన్న ‘మై హోమ్ గ్రూప్’ ఈ ఆధునిక ఆకాంక్షలకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘మై హోమ్ వ్యోమా’ (My Home Vyoma) ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

My Home Vyoma: మై హోమ్ వ్యోమా.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 12 అల్ట్రా లగ్జరీ టవర్లు.. సిటీ లైఫ్ కి సరికొత్త బెంచ్‌మార్క్!

ప్రైమ్ లొకేషన్ నానక్‌రామ్‌గూడ.. ప్రధాన హబ్‌లకు అత్యంత సమీపంలో:

ఐటీ, కమర్షియల్ హబ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నానక్‌రామ్‌గూడ – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంగణంలో 22.34 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కోకాపేట్, జూబ్లీహిల్స్ వంటి కీలక ప్రాంతాలకు కొద్ది నిమిషాల్లోనే చేరుకోవచ్చు. విమానాశ్రయం, ప్రముఖ ఆసుపత్రులు, హోటళ్లకు సమీపంలో ఉండటం దీని వ్యూహాత్మక ప్రాధాన్యతను పెంచుతోంది.