My home vyoma: లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ ‘మై హోమ్ వ్యోమా’.. జిమ్, స్పా, ఏరోబిక్స్ అండ్ పికిల్ బాల్.. ఇంకెన్నో అల్ట్రా మోడ్రన్ వసతులు
మై హోమ్ గ్రూప్స్ నిర్మిస్తున్న ‘మై హోమ్ వ్యోమా(My home vyoma)’ భవిష్యత్తు హైదరాబాద్‌లో ఒక వ్యూహాత్మక ల్యాండ్‌మార్క్‌గా నిలవనుంది.
- V Santhosh Kumar
- Published on- October 8, 2026 / 09:28 PM IST
my home vyoma luxury clubhouse amenities launched in nanakramguda hyderabad
My home vyoma: హైదరాబాద్ నగరంలో నానక్‌రామ్‌గూడ అంటే కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, అత్యున్నత విలాసవంతమైన జీవనశైలికి నిదర్శనం. మై హోమ్ గ్రూప్స్ నిర్మిస్తున్న ‘మై హోమ్ వ్యోమా’ భవిష్యత్తు హైదరాబాద్‌లో ఒక వ్యూహాత్మక ల్యాండ్‌మార్క్‌గా నిలవనుంది. ఇక్కడ లగ్జరీ అంటే కేవలం ఇంట్లోని ఫిట్టింగ్స్ మాత్రమే కాదు.. మనకు నచ్చిన రీతిలో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపడమే నిజమైన విలాసం అనే కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారు.
లక్ష చదరపు అడుగుల్లో రెండు క్లబ్‌హౌస్‌లు.. సకల సౌకర్యాలతో రాజసమైన నివాసం:
మై హోమ్ వ్యోమా ప్రాంగణంలో లక్ష చదరపు అడుగులకు పైగా సువిశాల విస్తీర్ణంలో రెండు గ్రాండ్ క్లబ్‌హౌస్‌లు కొలువుదీరాయి. వీటిలో అత్యాధునిక జిమ్, స్పా, యోగా, పికిల్ బాల్, ఇండోర్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మల్టీపర్పస్ హాళ్లు, సూపర్ మార్కెట్లు, బ్యాంకులు, హెల్త్ సెంటర్లు ఉండటం వల్ల ప్రాంగణం దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఒక్కరూ విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు.
