హైదరాబాద్ : చెత్త, వ్యర్థ పదార్థాలను రోడ్లపై పడేస్తున్నారా ? ఇక మీ ఆటలు సాగవ్. ఇలా చేస్తే జరిమానా పడుద్ది అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. పంచాయతీ రాజ్ శాఖ చట్టం 2018లో కఠిన నిబంధనలు చేర్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
చెత్తను రోడ్లపై పడేసే వారికి రూ.500 విధిస్తారు. మురుగునీటిని రోడ్డుపైకి వదిలినా.. మంచినీటిని కలుషితం చేసినా మరో రూ.500 ఫైన్ విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే వెయ్యి ఫైన్ పడుద్ది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే రూ.2వేలు జరిమానా విధించనున్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.
పంచాయతీ రాజ్ చట్టంలో నిబంధనలను విస్మరిస్తే జరిమానాలు :
గ్రామ పంచాయతీ ఆస్తులు ఆక్రమించడం : రూ. 2000
సింక్, మురుగునీటిని రోడ్లపైకి వదిలేయడం : రూ. 500
మంచినీటి ప్రదేశంలో స్నానం..దుస్తులు ఉతికితే : రూ. 500
రహదారులపై గుంతలు..అస్తవ్యస్థం చేస్తే : రూ. 500
లైసెన్స్ లేకుండా మార్కెట్ ప్రారంభిస్తే : రూ. 1000
స్లాటర్ హౌజ్‌ల బయట జంతువులను వధిస్తే : రూ. 2000
ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే : రూ. 1000
మురికినీటి ప్రవహానికి అడ్డు తగిలేలా నిర్మాణం చేపడితే : రూ. 2000
లైసెన్స్ లేకుండా క్వారీ పనులు చేస్తే : రూ. 500
నోటిసు ఇచ్చిన తరువాత కూడా పనులు చేయకపోతే : రూ. 500