బంపర్ ఆఫర్ : ట్రాఫిక్ చలాన్లు విధించం.. పోలీసుల కీలక నిర్ణయం!

ట్రాఫిక్ నిబంధలన ఉల్లంఘనలపై చలాన్లు విధించడంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Publish Date - September 14, 2019 / 12:28 PM IST

ట్రాఫిక్ నిబంధలన ఉల్లంఘనలపై చలాన్లు విధించడంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ట్రాఫిక్ నిబంధలన ఉల్లంఘనలపై చలాన్లు విధించడంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం (సెప్టెంబర్ 14) నుంచి కొత్త వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. డీజీపీ, రాచకొండ సీపీ ఆదేశాలనుసారం తమ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు విధించడం లేదు. నిబంధలనలను అనుసరించి హెల్మట్ ధరించని వాహనదారులతో అక్కడే కొనిస్తున్నారు.

అంతేకాదు.. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ లైసెన్స్ లేనివారికి కూడా వెంటనే సంబంధిత డాక్యుమెంట్లు జారీ అయ్యేలా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వాహన డాక్యుమెంట్లతో పాటు హెల్మట్ కొనిచ్చే ప్రయత్నాన్ని శనివారం నుంచి ప్రారంభించినట్టు ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ రావు చెప్పారు. 

కొత్త ట్రాఫిక్ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంకా కొత్త చట్టం అమల్లోకి రానప్పటికీ ముందుగానే ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. భారీ జరిమానాల నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా వాహనాల సంబంధిత పత్రాలను చూపించాల్సిన అవసరం ఉందని సూచనలు చేస్తున్నారు.