కోడెలది ఆత్మహత్య కాదు.. సీఎం జగన్ హత్య చేశారు: ఎంపీ సంచలన వ్యాఖ్యలు

  • Publish Date - September 16, 2019 / 10:18 AM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై తెలుగుదేశం నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నానీ కోడెల మరణం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. కోడెలది ఆత్మహత్య కాదని, దారుణహత్య అన్నారు.

కోడెల శివప్రసాదరావును సీఎం జగన్మోహన్ రెడ్డి దారుణంగా హత్యచేశారంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కోడెల ఆత్మకు శాంతి చేకూర్చాలని.. భగవంతున్ని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నట్లు ట్వీట్ చేసిన ఆయన ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రవ్యాఖ్యలు చేశారు.