భారీ వర్షం.. ఓల్డ్ మలక్ పేట్‌లో విషాదం..

  • Publish Date - October 17, 2020 / 08:36 PM IST

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు ప్రతాపానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగిపోతున్నాయి.



నగరంలో మళ్లీ కుంభవృష్టి కురిసింది. మూడు రోజుల తర్వాత మళ్లీ వర్షం దంచికొడుతోంది. ఈ వర్షం కారణంగా ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు.



ఓల్డ్ మలక్ పేట్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. తడిచిన విద్యుత్ స్తంభానికి తగలడంతో రాములు అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తున్న రాములు.. ఫుట్‌పాత్‌పై ఉన్న కరెంట్ పోల్‌కు తగిలాడు.

అక్కడికక్కడే చనిపోయాడు. చాదర్ ఘాట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.