Swine Flue : గాంధీలో స్వైన్ ఫ్లూతో మృ‌తి

  • Publish Date - February 13, 2019 / 01:25 AM IST

హైదరాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒకరు చనిపోయారు. ఉప్పల్‌కు చెందిన హరినాథ్‌రెడ్డికి స్వైన్‌ఫ్లూ సోకడంతో యశోద ఆస్పత్రిలో చేరాడు. నాలుగు రోజులుగా అక్కడే వైద్యం తీసుకున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే గాంధీ ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్‌లో చేరినా… అతడిని ఆస్పత్రి సిబ్బంది రెండు గంటల పాటు పట్టించుకోలేదు. దీంతో బంధువుల కళ్లముందే హరినాథ్‌రెడ్డి ప్రాణాలొదిలాడు. గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగానే హరినాథ్‌రెడ్డి చనిపోయాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. తాము తీసుకొచ్చిన సమయంలో వైద్యం అందించి ఉంటే హరినాథ్‌రెడ్డి బ్రతికేవాడని చెబుతున్నారు.