నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు మీరు రైళ్లను ఉపయోగిస్తుంటారా ? అందులో MMTS రైళ్లో వెళుతుంటారా..అయితే మీకో గమనిక..సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ఫలక్ నుమా – లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
ఫలక్ నుమా – సికింద్రాబాద్ వరకు పరిమితమవుతాయని వెల్లడించారు. అలాగే నాంపల్లి – ఫలక్ నుమా సర్వీసులు సికింద్రాబాద్ – ఫలక్ నుమా మధ్య రద్దు కానున్నట్లు తెలిపారు. కేవలం ట్రాక్ మరమ్మత్తుల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఎంఎంటీఎస్ రెండో దశ మొదటి భాగాన్ని 2019 అక్టోబర్ నాటికి పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నెలలో రెండో దశ ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయాణీకులను ఆకర్షించేందుకు రైళ్లకు సరికొత్త రూపాన్ని తెచ్చారు. ఇప్పటిదాక లేత నీలం రంగులో క కనిపించిన రైళ్లన్నీ..ముదురు గులాబీ వర్ణంలో మెరిసిపోతున్నాయి. అంతేగాకుండా కొన్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. భద్రమైన, చవకైన రవాణా ఎంఎంటీఎస్ జంటనగరాల ప్రజల ఆదరణ పొందుతోంది.
Read More : వెదర్ అలర్ట్ : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు