హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కొలువుదీరనుంది. జనవరి 17 నుండి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్పీకర్‌గా ఎవరు ఎన్నికవుతారు ? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే సీనియర్లు ఈ పదవిని తీసుకోవడానికి మొహం చాటేస్తున్నారు. సీనియర్లనే ఎన్నిక చేయాలని గులాబీ దళపతి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. సీనియర్ నేతగా ఉన్న పోచారం పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్పీకర్ పదవికి పోచారంతో పాటు పద్మా దేవేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు.
గత ప్రభుత్వంలో పోచారం..వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాదు..సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ సమయంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి కేసీఆర్ పక్కన చేరారు. బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన 6సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.