కరోనాపై ఫైటింగ్: విజయ్ దేవరకొండ స్పెషల్ వీడియో!

  • Publish Date - March 10, 2020 / 11:48 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలో కూడా రోజురోజుకు విస్తృతం అవుతుంది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోండగా.. తెలంగాణలో కూడా కరోనా వచ్చిందంటూ వచ్చిన వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీల చేత ప్రచారం చేయిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. 

లేటెస్ట్‌గా హీరో విజయ్ దేవరకొండ కరోనాపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం విజయ్‍‌తో కలిసి ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కరోనా వైరస్ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో ప్రజలకు వివరించాడు విజయ్ దేవరకొండ. షేక్ హ్యాండ్‌లు వద్దు పద్దతిగా నమస్కారం పెట్టాలంటూ వీడియోలో సూచనలు చేశారు.

ఎవరైనా దగ్గుతూ, తుమ్ముతూ ఉంటే వారికి మూడగుల దూరం ఉండాలని వీడియోలో విజయ్ సూచనలు చేశాడు. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలలో తిరగకపోవడమే మంచిదని అన్నారు విజయ్. అంతేకాకుండా వ్యాధి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్టు కనిపిస్తే వెంటనే 104కి కాల్ చేసి, డాక్టర్‌ని సంప్రదించాలని విజయ్ దేవరకొండ కోరారు. కరోనాపై ఫైటింగ్ అంటూ విజయ్ ట్విట్టర్‌లో వీడియో పంచుకున్నాడు.