గుర్తించండి సారూ.. జనం భయపడుతున్నారు: హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ కు భారీ పగుళ్లు

  • Publish Date - September 26, 2019 / 05:25 AM IST

నిన్న గాక మొన్న మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడి ఓ యువతి మీద పడడంతో ప్రాణాలు పోయిన సంగతి మరవలేదు. అయితే హైదరాబాద్ నగరంలో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇంకా ఉన్నట్లుగానే తెలుస్తుంది పలు చోట్ల బ్రిడ్జ్ లు పగుళ్లు కనిపిస్తూ నగర ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

అయితే లేటెస్ట్ గా హైదరాబాద్‌లో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను ఎయిర్ పోర్ట్‌కు చేరవేసే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేలో ఫ్లై ఓవర్‌ పిల్లర్‌ ఒకటి పగుళ్లకు గురైంది.

హైదరాబాద్ నగరంలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. పిల్లర్ నంబర్ 20 దగ్గర జాయింట్లు కొన్ని పగిలి ప్రమాదకరంగా మారి ఉన్న బ్రిడ్జ్ స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని చూస్తున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవలే ఫ్లై ఓవర్‌పై గుంతలు ఉన్నాయంటూ రిపేర్లు చేపట్టి పూర్తి చేసిన అధికారులు దీనిని గుర్తించలేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.