ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.
ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. మరో వైపు ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ (తూర్పు పశ్చిమ గాలుల కలయిక) 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.
దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణ, కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోనూ మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గడిచిన 24 గంటల్లో కోస్తాలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కోయిడా 6, ఇచ్ఛాపురం 5, వేలేరుపాడు, వరరామ చంద్రాపురం 4, నర్సీపట్నం 3, చింతపల్లి, యలమంచిలి, అనకాలపల్లి, కుక్కునూరులో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాత నమోదు అయింది.