ఫుల్లు హ్యాపీగా ఉన్నా.. తెలంగాణ మొత్తం లడ్డులూ పంచాలనుంది: రాఖీ సావంత్

థ్యాంక్స్ టు సీఎం, థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. సెలబ్రేషన్ చేసుకోవాలని అనిపిస్తోంది. తెలంగాణలోని ప్రతి ఇంట్లో లడ్డూలు పంచాలని ఉంది.

థ్యాంక్స్ టు సీఎం, థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. సెలబ్రేషన్ చేసుకోవాలని అనిపిస్తోంది. తెలంగాణలోని ప్రతి ఇంట్లో లడ్డూలు పంచాలని ఉంది.

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. 10tvతో మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను బాలీవుడ్ రాఖీ సావంత్ అని మొదలుపెట్టిన ఆమె.. మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల స్పందించారు. ఫుల్లు హ్యాపీగా ఉన్నానని తెలంగాణలోని ప్రతి ఇంటికీ లడ్డూలు పంచాలని అనిపిస్తోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

‘థ్యాంక్స్ టు సీఎం, థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. సెలబ్రేషన్ చేసుకోవాలని అనిపిస్తోంది. తెలంగాణలోని ప్రతి ఇంట్లో లడ్డూలు పంచాలని ఉంది. దిశ అత్యాచారం గురించి తెలిసి అందరితో పాటు నేను కూడా ఏడ్చా. రేప్ చేసి కాల్చేశారు. ఈ ఘటనలో తెలంగాణ సీఎం, పోలీసులు కలిసి చరిత్ర సృష్టించారు. 

ఎవరికైతే సోదరీమణులు ఉంటారో వారికి, మహిళా కార్మికులకి, ఇవాళే దీపావళి, న్యూ ఇయర్, ఈద్. నిర్భయ ఘటనలోనూ నిందితులు ఇప్పటికీ బతికే ఉన్నారు. మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. రేప్ ఘటనలో 9రోజుల్లోనే ఎన్‌కౌంటర్ చేశారు. దేశంలోని సీఎంలు, పోలీసులు అంతా ఇదే చేయాలని కోరుకుంటున్నా. కోర్టులో ఉన్న రేప్ కేసులన్నింటికీ ఇదే శిక్ష అమలు చేయాలనుకుంటున్నా. భారతదేశంలోని ప్రతి ఒక్క మహిళ స్వేచ్ఛగా, సురక్షితంగా బతుకుతుంది. అప్పుడే భారత్‌లోని ప్రతి మహిళ గౌరవంగా బతుకుతుంది’ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ముందుగా జరిగిన దర్యాప్తు కాకుండా కేసు రీ కన్‌స్ట్రక్షన్ చేయాలని పోలీసులు భావించారు. నిందితులు ఫోన్‌తో పాటు మరికొన్ని కీలక ఆధారాలు దాచిపెట్టినట్లు చెప్పారు. వాటిని సేకరించేందుకు పది మంది పోలీసులతో కలిసి వచ్చిన నిందితులు పారిపోయే క్రమంలో నలుగురు చేరి గుంపుగా ఆయుధాలు లాక్కుని దాడి చేయడం మొదలుపెట్టారు. వారికి 10మంది పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. కాసేపటి వరకూ జరిగిన కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు.