సెల్ ఫోన్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అంటే ఫోటోలు తీయాలి అంటే కెమెరాలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. కానీ ఇప్పడు అలా కాదు. ఎటువంటి సంధర్భం అయినా కూడా సెల్ ఫోన్లలోనే ఫోటోలు తీసి బంధించేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఘనంగా ముగిసిన ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనోత్సవం సంధర్భంగా ఓ ఫోటో తీయగా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భారీ గణేషుడు గంగమ్మ ఒడికి చేరే క్షణం కోసం ఆతృతగా ఎదురుచూసిన భక్తులు భారీ గణనాథుడిని కనులారా దర్శించుకోవడమే కాదు. సెల్ ఫోన్లలోనూ బంధించుకున్నారు. గతానికి భిన్నంగా ఈసారి అన్ని వినాయకుల కంటే ముందు.. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం జరగడం వల్ల ప్రత్యేకత సంతరించుకున్న గణనాథుని దర్శించుకునేందుకు ట్యాంక్ బండ్‌కు భారీగా జనం చేరుకున్నారు. దీంతో ట్యాంక్ బండ్ ప్రాంతమంతా రద్దీగా మారింది.
భారీగా ఘననాథుని ఫోటోలు తీస్తున్న జనం ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రను చూసేందుకు నగరం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. శోభాయాత్ర, వీడ్కోలును తిలకించే వేలాది మంది ఆ గణనాథుని చూసుకుని తరించిపోయారు.