ఫోర్జరీ కేసు, నిధుల మళ్లింపు కేసులో అజ్ఞాతంలోకి వెళ్లిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్.. సినీ నటుడు శివాజీ సైబర్ క్రెమ్ పోలీసులకు ఈ-మెయిల్ పంపారు. విచారణకు హాజరయ్యేందుకు మరో 10 రోజులు గడువును.. రవిప్రకాశ్ మెయిల్ ద్వారా కోరారు. వ్యక్తిగత కారణాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు రవిప్రకాశ్ తన ఈ-మెయిల్‌లో పోలీసులకు వెల్లడించారు.
అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న శివాజీ కూడా తనకు ఆరోగ్యం బాగాలేదని, వాంతులు, విరోచనాలు అవుతున్నాయి అంటూ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని.. విచారణకు హాజరుకావటానికి 10 రోజులు గడువు అవసరమని కోరారు. అయితే వీరిద్దరు పంపిన ఈ మెయిల్స్‌పై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినా రవిప్రకాశ్ స్పందించకపోవడంతో తదుపరి చర్యలపై సైబరాబాద్ పోలీసులు దృష్టిపెట్టారు. అయితే మెయిల్స్ పంపిన ఐపీ అడ్రెస్‌ల ద్వారా ట్రేస్ చేసిన పోలీసులు.. రవిప్రకాశ్, శివాజీ బెజవాడలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.