తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులను ఏరివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పాస్‌తో పాటు రేషన్ షాపుల్లో సరుకులు ఎక్కడి నుంచైనా డ్రా చేసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది లబ్దిదారులు సరుకులు తీసుకోవడం లేదు. దీనిపై పౌరసరఫరాల శాఖ ఆరా తీస్తోంది. వీటిని గుర్తించి తీసేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి వరుసగా సరుకులు తీసుకోకున్నా కార్డులు రద్దు కావని ఆ ఆ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.
అనర్హుల ఏరివేతలో భాగంగా సరుకులకు దూరంగా ఉంటున్న లబ్దిదారుల ఆర్థిక పరిస్థితిపై ఆరా తీసేందుకు సర్కిళ్ల వారీగా సర్వేకు సిద్దమౌతున్నారు అధికారులు. బీపీఎల్ కిందకు రాకుంటే..వారిని గుర్తించి కార్డులను తొలగించాలని యోచిస్తోంది. ఆధార్ అనుసంధానంతో సొంత ఆస్తి, వ్యాపారం, నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండి..పన్ను చెల్లింపు దారులను ఇప్పటికే అనర్హులుగా గుర్తించి కార్డులను రద్దు చేసింది.
తొలుత తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసిన ప్రభుత్వం..వాటి స్థానంలో ఆహార భద్రత కార్డులను తీసుకొచ్చింది. కార్డు దారుల్లో సగానికి పైగా మధ్య తరగతి కుటుంబాలున్నాయి. దీంతో రేషన్ బియ్యంపై ఆసక్తి తగ్గింది. నాణ్యంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మధ్యతరగతి వారు వీటిని తినేందుకు ఆసక్తి చూపడం లేదు. బియ్యం తీసుకోకున్నా..కార్డు రద్దు కాదని చెప్పడంతో లబ్దిదారులు పూర్తిగా తీసుకోవడమే మానేశారు.
Read More : కేన్సర్ జాకెట్ : మహిళా పారిశుధ్య కార్మికులకు పరీక్షలు