రిపబ్లిక్ డే 2019 : ముస్తాబైన పరేడ్ గ్రౌండ్‌

  • Publish Date - January 24, 2019 / 09:47 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లిక్ డే 2019 వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో పనులు జరుగుతున్నాయి. వేదికను అందంగా అలంకరించారు. మైదానంలో వాయుసేన, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్,  సైనికులు, పోలీసులు కవాతు నిర్వహించారు.
అతిథులు కూర్చొని వేడుకలు తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. వేడుకలు చూసేందుకు వచ్చిన వారికి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్‌లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

జనవరి 26వ తేదీన జరిగే వేడుకుల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ మైదానం చుట్టూ పోలీసులు మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ వద్ద పోలీసులు మోహరించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. జనవరి 24వ తేదీ ఉదయం నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు…50 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు.