పరిశోధనకు కొత్త దిశ: హైదరాబాద్ లో ఐదు వేదికలతో SCIVYT ప్రారంభం

విద్యార్థులు, వైద్యులు, పరిశోధకులకు సహకారం అందించేందుకు సైవిట్ రీసెర్చ్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో ఐదు వేదికల సమగ్ర వ్యవస్థను ప్రారంభించింది.

SCIVYT ఐదు వేదికల ప్రారంభోత్సవంలో డాక్టర్ యతీంద్ర విట్యాల (ఎడమ నుంచి రెండో వ్యక్తి)

విద్యార్థులు, వైద్యులు పరిశోధకులకు అభ్యాసం నుంచి శాస్త్రీయ ప్రచురణ వరకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో సైవిట్ రీసెర్చ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన ఐదు వేదికల సమగ్ర వ్యవస్థను ప్రారంభించింది. 2026 జులై 29 న హైదరాబాద్ లోని లక్డికాపూల్ లో ఉన్న హాంప్ షైర్ ప్లాజా హోటల్ లో ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది.

Amit Shah: తెలంగాణలో బీజేపీదే అధికారం.. రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యారు? రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా ఫైర్

తెలంగాణకు చెందిన వైద్య శాత్రవేత్త, సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ యతీంద్ర విట్యాల ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న సైవిట్, పరిశోధన ప్రయాణంలోని వివిధ దశలను అనుసంధానించేందుకు కృషి చేస్తోంది. ” ఐదు వేదికలు – ఒకే లక్ష్యం ” అనే భావనతో YETZU, BEENTU AI, Submit Right, VITUOR NationCite లను ఒకే వ్యవస్థలో భాగంగా తీసుకొచ్చింది.

ఒక పరిశోధన, ఆలోచనను శాస్త్రీయ అధ్యయనంగా అభి వృద్ధి చేయడానికి ఆసక్తితో పాటు సరైన శిక్షణ, మార్గ దర్శకత్వం, పరిశోధన, పద్దతులపై అవగాహన అవసరం. అధ్యయన ఫలితాలను విశ్లేషించడం, స్పష్టంగా రాయడం తగిన జర్నల్ కు సమర్పించడం కూడా కీలకమే. ఈ దశలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించి, పరోశోధకులకు నిరంతర సహకారం అందించడం SCIVYT లక్ష్యం.

వైద్య విద్యార్థులు యువ వైద్యులు, ప్రారంభ దశలో ఉన్న పరిశోధకులకు ఈ విధమైన సమగ్ర సహకారం ఉపయోగపడుతుంది. అధ్యయన రూపకల్పన, శాస్త్రీయ ఆధారాల విమర్శనాత్మక పరిశీలన, ఫలితాల అర్ధవివరణ పరిశోధన నైతికత వంటి అంశాలలో నైపుణ్యాలను పెంపొందించడం సంస్థ విద్య దృకృథంలో ప్రధాన భాగం.
ఈ వ్యవస్థలో YETZU అభ్యసనం, మార్గదర్శకత్వానికి ప్రాధాన్యం ఇస్తోంది విద్యార్థులు తమ విషయ పరిజ్ఞానాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు వైద్య విజ్ఞానాన్ని క్లినికల్ అవగాహన, పరిశోధనా ఆలోచనలతో అనుసంధానించేందుకు తోడ్పడుతుంది.

BEENTU AI శాస్త్రీయ రచనలో సహాయ వేదికగా పనిచేస్తోంది. పరిశోధకులు తమ ఆలోచనలను క్రమబద్దీకరించి, స్పష్టంగా వ్యక్తీకరించేందుకు ఇది సహాయపడుతుంది.

రచనలోని వాస్తవాల ఖచ్చితత్వం, మూలాధారాల సరైన వినియోగం స్వతంత్రత, పరిశోధన సమగ్రతపై భాద్యత రచయితలదే.
Submit Right పరిశోధనా పత్రాల తయారీ జర్నల్ సమర్పణ ప్రక్రియలో సహకారం అందిస్తుంది పత్రం ఆకృతి, విషయాల ప్రదర్శన, జర్నల్ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయడం వంటి అంశాల్లో ప్రారంభ దశ పరిశోధకులకు మార్గదర్శకం అందించడం దీని ఉద్దేశ్యం.

VITUOR నిపుణుల సమీక్షతో కూడిన ఓపెన్ యాక్సిస్ వైద్య ప్రచురణ వేదికగా ఈ వ్యవస్థలో భాగమైంది. శాస్త్రీయ సమాచారాన్ని విస్తృత పాఠక వర్గానికి అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యం **NationCite ** పరిశోధనల గుర్తింపు వ్యాప్తి విశ్లేషణలపై ద్రుష్టి సారిస్తుంది పరిశోధకుల శాస్త్రీయ కృషిని కనుగొనడం, అర్ధం చేసుకోవడం సులభతరం చేయడానికి ఇది తోడ్పడుతుంది.

ప్రారంభ కార్యక్రమ ప్రచార పత్రంలో వైద్య విద్యా రంగాలకు చెందిన ప్రముఖులను పేర్కొన్నారు. వారిలో కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర రావు, కేర్ హాస్పిటల్స్ మహిళా శిశు విభాగం క్లినికల్ డైరెక్టర్, విభాగాధిపతి డాక్టర్ మంజుల అనగాని, స్టార్ హాస్పిటల్స్ లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మరియు మల్లారెడ్డి విశ్వ విద్యా పీఠ్ వైస్ చైర్మన్ డాక్టర్ చామకూర ప్రీతి రెడ్డి ఉన్నారు.

కిర్గిజ్ రిపబ్లిక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ అక్రెడిటేషన్ కమిటీ నిపుణుడు డాక్టర్ తుగోల్బాయ్ తగాయేవ్ ను కూడా ప్రచార పత్రం లో పేర్కొన్నారు. ఇది కార్యక్రమానికి ప్రతిపాదించిన అంతర్జాతీయ దృకృధాన్ని ప్రతిబింబిస్తుంది.

వైద్యం శాస్త్రీయ పరిశోధనల్లో డాక్టర్ యతీంద్ర విట్యాలకు ఉన్న అనుభవం SCIVYT కార్యాచరణకు పునాదిగా నిలుస్తోంది. సహా వ్యవస్థాపకురాలు డాక్టర్ కృష్ణప్రియ కంతేటితో కలిసి విద్య, వైద్య విజ్ఞానం సాంకేతికతను అనుసంధానిస్తూ పరిశోధనలో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు అయన కృషి చేస్తున్నారు

హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రారంభం, తెలంగాణ నుంచి పరిశోధన సామర్ధ్యాల అభివృద్ధిపై ద్రుష్టి పెట్టిన ఒక ఔత్సాహిక ప్రయత్నానికి ముఖ్యమైన అడుగు. విద్యార్థుల ఆసక్తిని పరిశోధనా అవగాహనగా మార్చడం, పరిశోధకుల ఆలోచనలను నాణ్యమైన శాస్త్రీయ రచనలుగా తీర్చిదిద్ధేందుకు సహకరించడం సంస్థ లక్ష్యం.

తన వేదికల ద్వారా నాణ్యమైన మార్గదర్శకత్వం, విశ్వసనీయ సేవలు, ఉన్నత శాస్త్రీయ ప్రమాణాలను కొనసాగిస్తూ విద్య నుంచి పరిశోధనకు, పరిశోధన నుంచి విస్తృత జ్ఞాన వ్యాప్తికి అనుసంధానం కల్పించాలనే దిశగా SCIVYT ముందుకు సాగుతోంది.