శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచారం కేసులో బాధితురాలి పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీపీ సజ్జనార్. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బాధితురాలి పేరును దిశాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని, సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ ఈ మేరకు సహకరించాలని సూచించారు పోలీసులు.
పాశవికంగా డాక్టర్‌పై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తుండగా.. ఈ ఘటనపై రాజకీయ నాయకులందరూ స్పందించడమే కాకుండా.. ఆ నలుగురికి కఠిన శిక్షలు పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా జస్టిస్ ఫర్ ప్రియాంకారెడ్డి అనే ఆందోళనలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఆమె పేరుకు బదులుగా నిర్భయ, అభయ పేర్లలాగానే దిశాగా పేరు మార్చారు పోలీసులు. ఇకపై ‘జస్టిస్ ఫర్ దిశా’గా పిలవాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులతో చర్చించిన సజ్జనార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.