BJP Slams KCR: వారితో సభలో పాల్గొన్నంత మాత్రాన తెలంగాణలో కేసీఆర్ ఓటు బ్యాంకు పెరుగుతుందా?: బీజేపీ

తెలంగాణలోని ఖమ్మంలో నిన్న బీఆర్ఎస్ నిర్వహించిన సభకు పలువురు జాతీయ నేతలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడంపై బీజేపీ స్పందించింది. ప్రతిపక్ష నేతలతో కలిసి కేసీఆర్ వేదికను పంచుకున్నంత మాత్రాన తెలంగాణలో ఆయన ఓటు బ్యాంకును పెంచుకోలేరని బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్ అన్నారు.

BJP Slams KCR: తెలంగాణలోని ఖమ్మంలో నిన్న బీఆర్ఎస్ నిర్వహించిన సభకు పలువురు జాతీయ నేతలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడంపై బీజేపీ స్పందించింది. ప్రతిపక్ష నేతలతో కలిసి కేసీఆర్ వేదికను పంచుకున్నంత మాత్రాన తెలంగాణలో ఆయన ఓటు బ్యాంకును పెంచుకోలేరని బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్ అన్నారు.

తెలంగాణలో అధికారాన్ని కోల్పోతామని కేసీఆర్ భయపడుతున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలన పట్ల తెలంగాణ ప్రజలు విసిగిపోతున్నారని చెప్పారు. ఆయనను పదవి నుంచి దించేయాలని నిర్ణయించుకున్నారని తరుణ్ ఛుగ్ అన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు అందడం లేదని ఆరోపించారు. ఉద్యోగులు, రైతులు కేసీఆర్ పాలన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అందించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను కూడా తెలంగాణలో అమలు చేయడం లేదని చెప్పారు. కాగా, నిన్న నిర్వహించిన ఖమ్మం సభలో కేసీఆర్ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పాల్గొన్నారు. వారంతా కేంద్ర సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Rashmika Mandanna : గొడవ ముగిసిందా.. రిషబ్, రక్షిత్ పై పాజిటివ్ వ్యాఖ్యలు చేసిన రష్మిక..

ట్రెండింగ్ వార్తలు