చల్లని కబురు : జూన్ 4న కేరళకు.. 10 తర్వాత తెలంగాణకు రుతుపవనాలు

2019 మే 22వ తేదీ నాటికే అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతు రుతుపవనాలు తాకుతాయని వెల్లడించింది. అక్కడి నుంచి

2019 మే 22వ తేదీ నాటికే అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతు రుతుపవనాలు తాకుతాయని వెల్లడించింది. అక్కడి నుంచి

మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి శుభవార్త చెప్పింది స్కైమెట్. 2019 మే 22వ తేదీ నాటికే అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతు రుతుపవనాలు తాకుతాయని వెల్లడించింది. అక్కడి నుంచి జూన్ 4వ తేదీ నాటికి కేరళ తీరానికి చేరుకుంటాయని స్పష్టం చేస్తోంది స్కైమెట్ వెదర్ రిపోర్ట్. ఈసారి రుతుపవనాల్లో కదలిక వేగంగా ఉంటుందని.. చురుగ్గా కదులుతాయని కూడా అంచనా వేస్తోంది. 

జూన్ 4వ తేదీ కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు.. 10వ తేదీ తర్వాత తెలంగాణకు విస్తరిస్తాయని స్పష్టం చేసింది. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకోవటానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేస్తోంది రిపోర్ట్. జూన్ 29వ తేదీ నాటికి ఢిల్లీని టచ్ చేస్తాయని.. ప్రారంభంలోనే వర్షాలు బాగా పడతాయని అంచనా వేస్తున్నారు. అతి భారీ వర్షాలు ఉండకపోవచ్చని.. సాధారణ వర్షాలకు లోటు ఉండదని కూడా ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉంటుందని.. అది ఈశాన్య, మధ్య భారతదేశం ప్రాంతాల్లో తక్కువ వర్షం ఉంటుందని స్కైమెట్ అంచనా వేస్తోంది.

జూన్ 4వ తేదీ నాటికి రెండు రోజులు అటూ ఇటూగా రుతుపవనాలు ప్రవేశించటం ఖాయం అంటున్నారు. ఒకటి, రెండు రోజులు తేడా ఉండొచ్చు అని.. అంత కంటే ఈ తేదీల్లో పెద్దగా మార్పు ఉండదని అంచనా వేస్తున్నారు.