హైద‌రాబాద్ లో వర్షం : చల్లబడిన వాతావరణం

కొన్ని రోజులుగా ఎండలతో సతమతమవుతున్న నగర వాసులపై వరుణుడు కొంత కరుణించాడు. వాతావరణం చల్లబడింది.

  • Publish Date - April 5, 2019 / 01:31 PM IST

కొన్ని రోజులుగా ఎండలతో సతమతమవుతున్న నగర వాసులపై వరుణుడు కొంత కరుణించాడు. వాతావరణం చల్లబడింది.

కొన్ని రోజులుగా ఎండలతో సతమతమవుతున్న హైద‌రాబాద్ వాసులపై వరుణుడు కరుణించాడు. వాతావరణం చల్లబడింది. పగలంతా నిప్పులు చెరిగిన సూర్యుడు.. సాయంత్రం చల్లబడిపోయాడు. హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. కొద్ది సమయమే కురిసినా వాతావరణం కూల్‌ కావడంతో ప్రజలు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు.
Read Also : బాధలు పోతాయి : ఈ శ్లోకం చదువుతూ ఉగాది పచ్చడి తినాలి

అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బోరబండ, మియాపూర్, ఎస్ఆర్ నగర్, లింగపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ వేడి..మరోవైపు ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలు రిలాక్స్ అయ్యారు. 

మార్చి నెల నుండే ప్రారంభమైన ఎండలు రోజు రోజుకు అధికమౌతున్నాయి. పలు జిల్లాల్లో రెండు నుండి మూడు డిగ్రీల అధికంగా టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో పలు జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిపోతోంది. పగలు ఎండలు..రాత్రి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది వడదెబ్బ తగులుతోంది. 
Read Also : పట్టుబడుతున్న కట్టలు : బంజారాహిల్స్ లో మూడున్నర కోట్లు

ట్రెండింగ్ వార్తలు