బీ కేర్ ఫుల్ : ఈ సమ్మర్ చాలా హాట్ గురూ

  • Publish Date - March 1, 2019 / 12:59 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఫిబ్రవరిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడమే అందుకు నిదర్శనమని వాతావరణ శాఖ పేర్కొంటోంది. 2016లో వేసవి కాలంలో ఎలాంటి వడగాలులు వీచాయో..అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 2018లో కేవలం 7 రోజులు మాత్రమే వడగాలులు వీచాయని, ఈ ఏడాది మాత్రం అధికంగా వడగాలులు వీస్తాయని తెలిపింది.

ఫిబ్రవరి మాసంలో మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకు కారణం గాలిలో తేమ తగ్గడమేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ వేసవి కాలంలో రాష్ట్రంలో చాలాచోట్ల 46 నుండి 47 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డయ్యే సూచనలున్నాయని విశ్లేషించారు. ఏప్రిల్, మే నెలలో వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

ట్రెండింగ్ వార్తలు