టీ-సేవ కేంద్రం కోసం: దరఖాస్తు చేసుకోండి

  • Publish Date - April 15, 2019 / 03:29 AM IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీ సేవ ఆన్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్‌ 30వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని టీ సేవ డైరెక్టర్‌ అడపా వెంకట్‌ రెడ్డి తెలిపారు. స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌ ఫీజులో 25శాతం రాయితీ ఇవ్వనున్నారు. దరఖాస్తు ఫారాల కోసం 8179955744, 9505800050 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.

నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. టీ సేవ ఆన్‌లైన్‌ కేంద్రాల ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బిల్లు కట్టడం, బస్‌, ట్రైన్‌, టికెట్‌లు బుక్‌ చేయడం వంటి సేవలను వినియోగదారులకు దీని ద్వారా అందించవచ్చు.  పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ www.tsevcetre.comలో సంప్రదించవచ్చు.