Core Urban Region Bill-2026: హైదరాబాద్ కు కొత్త పాలనా వ్యవస్థ.. 70 ఏళ్ల జీహెచ్‌ఎంసీ చట్టం రద్దు.. అసెంబ్లీలో సర్కార్ సంచలన బిల్లు
హైదరాబాద్ మహానగర పాలనా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Core Urban Region Bill-2026)శ్రీకారం చుట్టింది.
- V Santhosh Kumar
- Published on- September 12, 2026 / 05:21 PM IST
Telangana Assembly introduced 'Core Urban Region Bill-2026' to bifurcate the GHMC into three corporations.
- జీహెచ్‌ఎంసీ మూడుగా విభజన
- ఆస్తి పన్ను విధానంలో మార్పులు
- భాగ్యనగరంలో నైట్ ఎకానమీ
Core Urban Region Bill-2026: హైదరాబాద్ మహానగర పాలనా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 70 ఏళ్ల నాటి పాత జీహెచ్‌ఎంసీ చట్టం (1955) స్థానంలో ను తీసుకువస్తూ ‘కోర్ అర్బన్ రీజియన్ (Core Urban Region Bill-2026) బిల్లు, 2026’ను శాసనసభలో ప్రవేశపెట్టింది. అప్పట్లో 15 లక్షల జనాభా కోసం రూపొందించిన చట్టం.. ప్రస్తుతం 1.3 కోట్లకు చేరిన నగర అవసరాలకు సరిపోవడం లేదని భావించిన సర్కార్, నగర రవాణా, అభివృద్ధిని మరింత సులభతరం చేసేందుకు ఈ కీలక బిల్లును సభ ముందుకు తీసుకొచ్చింది.
PM Narendra Modi: ‘బ్రిక్స్’ ఎవరికీ వ్యతిరేకం కాదు.. ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం
మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజన:
తాజా బిల్లు ప్రకారం ఇప్పటివరకు ఉన్న జీహెచ్‌ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించనున్నారు. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి, వీటిని ‘కోర్ అర్బన్ రీజియన్ (CURE)’ పరిధిలోకి తీసుకువస్తారు. ఈ మూడు కార్పొరేషన్ల మధ్య సమన్వయం కోసం ‘క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’తో పాటు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు.
ఆస్తి పన్ను విధానంలో మార్పులు.. నైట్ ఎకానమీ:
నగరంలో నిధుల కొరత తీర్చేందుకు ఆస్తి పన్ను విధానాన్ని వార్షిక బాటక విలువ నుంచి ‘క్యాపిటల్ వ్యాల్యూ’ ఆధారిత వ్యవస్థలోకి మారుస్తున్నారు. అలాగే అన్ని రకాల పౌర సేవల చెల్లింపుల కోసం సమగ్ర డిజిటల్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. మున్సిపల్ చట్ట చరిత్రలోనే తొలిసారిగా నగరంలో రాత్రివేళల్లో కూడా వ్యాపార లావాదేవీలను ప్రోత్సహించేలా ‘నైట్ ఎకానమీ’ పాలసీని కూడా ఈ కొత్త బిల్లులో పొందుపరిచారు.
