TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6 నుంచి.. సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ తీర్మానం చేసే ఛాన్స్
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు అసెంబ్లీ సెషన్స్ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేసే అవకాశం ఉంది.
- Narender Thiru
- Updated on- September 2, 2022 / 03:34 PM IST
TS Assembly: ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు అసెంబ్లీ సెషన్స్ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన పాటలు ఇవే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక విధానాలు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైనే సమావేశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా కీలక తీర్మానాలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బిహార్ పర్యటనలో కూడా సీఎం కేసీఆర్ ఇదే అంశంపై మాట్లాడారు. అన్ని రాష్ట్రాలు సీబీఐకి చెక్ పెట్టాలని ఆ సమయంలో సూచించారు. అలాగే ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం సూచించడంపైనా, తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాల్లో చర్చిస్తుంది.
Pawan Kalyan Birthday Special Song : మనల్ని ఎవడ్రా ఆపేది.. పవన్ కళ్యాణ్ బర్త్‌డే స్పెషల్ సాంగ్..
దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పే అవకాశం ఉంది. పోడు భూముల వ్యవహారంపై కూడా ఈ సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.
