తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. తెలంగాణ రెండో శాసససభ మొదటి సమావేశాలు ముగిశాయి.
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. తెలంగాణ రెండో శాసససభ మొదటి సమావేశాలు ముగిశాయి. జనవరి 17వ తేదీ నుంచి 20 తేదీ వరకు.. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొదటి రోజు శాసన సభ్యులు ప్రమాణం స్వీకారం చేశారు. రెండో రోజు అసెంబ్లీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. మూడవ రోజు శాసనసభ, మండలి ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నర్సింహన్ ప్రసంగించారు.
నాల్గవ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జనవరి 20 వ తేదీన సభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించిన తర్వాత అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.