ఐటీ రంగంలో దిగ్గజాలైన ఆపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ కంపెనీలు బెంగళూరు కాదని హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాయి ? బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ITIRకు ఒక్క నయా పైసా ఇవ్వలేదు..ఇస్తే రుజువు చేయమనండి అంటూ డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. 12 లక్షల 67 వేల టీఎస్ఐ పాస్ ద్వారా సృష్టించామన్నారు. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క చేసిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్‌లో హైదరాబాద్ బెంగళూరు దాటిపోయిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకపోతోందని..కాబట్టే 17 శాతం వృద్ధి రేటు సాధ్యమైందన్నారు. ఐటీ రంగంలో గతంలో 3 లక్షల ఉద్యోగాలు ఉంటే..ఇప్పుడు 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని సభకు తెలిపారు. కాంగ్రెస్ అంచనాలను తలదన్నే విధంగా పనిచేస్తోంది..పని చేస్తుందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యువతకు కేసీఆర్ సర్కార్‌పై సంపూర్ణమైన విశ్వాసం ఉందన్న మంత్రి కేటీఆర్…ఐదేళ్లలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కాంగ్రెస్ సభ్యుడు భట్టికి సూచించారు.