తెలంగాణ అసెంబ్లీ : పోచారం లక్ష్మీపుత్రుడు – కేసీఆర్

  • Publish Date - January 18, 2019 / 06:36 AM IST

హైదరాబాద్ : ‘పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్మీపుత్రుడు…ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో వ్యవసాయం బాగా అభివ‌ృద్ధి చెందింది. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను అభినందిస్తూ కేసీఆర్ మాట్లాడారు…అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. 
ఎన్నో మంచి పనులు…
పోచారం అనేక మెట్లు ఎక్కారని..ఆరు సార్లు సభకు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో మంచి పనులు జరిగాయని…రైతు బంధు పథకం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారని సభకు తెలిపారుర. బాన్సువాడ ఉప ఎన్నికలో అఖండమైన మెజార్టీతో గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముద్దుగా లక్ష్మీపుత్రడని పిలుచుకుంటానని కేసీఆర్ తెలిపారు. 
పోచారం ఇంటి పేరు కాదు…
అయితే జనవరి 18న వివిధ దినపత్రికలు చూస్తే…స్పీకర్‌గా పోచారం అని రాశారని…కానీ ఇంటిపేరు పోచారం కాదు ఇంటిపేరు పరిగె అని చెప్పారుర. స్వగ్రామం పేరును పెట్టుకోవడం గొప్పతనమని…స్పీకర్‌గా ఎన్నిక కావడం పోచారం గ్రామస్థులు ధన్యులయ్యారని అన్నారు. వినయశీలిగా, వివాద రహితుడిగా చక్కటి సేవలందించారని, వచ్చే ఫిబ్రవరి 10తో 70వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారని అన్నారు.
ఉద్యమ సమయంలో పోచారం…
1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో విద్యనభ్యసించే పోచారం…చాలా బాధ పెట్టారని గుర్తు చేసుకున్నారు. కక్షపూర్వకంగా సైఫాబాద్ పీఎస్‌లో నిర్భందించారని..తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పోచారం వెళ్లిపోయారని పేర్కొన్నారు. పోచారం కుటుంబం వ్యవసాయ కుటుంబం అని..నిజాం సాగర్ ఆయుకట్టుంలో వంద ఎకరాల మాగాణి ఉన్న కుటుంబం పోచారందని తెలిపారు. సమైక్య పాలనలో ఎలా కుచించింకపోయిందో..పోచారం కుటుంబం నష్టపోయిందన్నారు. మంత్రివర్గంలో పోచారం లేకపోవడం బాధగానే ఉందని…పరిపూర్ణమైన ఆయుష్షును..సంపూర్ణమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ ఆకాంక్షించారు.