విద్యార్థుల సమస్యలు చెప్పినప్పుడల్లా…అడ్డుపడుతున్న బాల్కా సుమన్ ఏమైనా విద్యార్థి నాయకుడా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క. మంత్రిగా కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌పై మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వివిధ సమస్యలను సభ దృష్టి తీసుకొచ్చారు.
రాష్ట్రం ఏర్పడితే చెందాల్సిన నిధులు తమకు వస్తాయని విద్యార్థులు ఆశించారని, ఫెలోషిప్ రావడం లేదని, మెస్ ఛార్జీలు పూర్తిగా ఇవ్వడం లేదని వినతిపత్రాలు యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు ఇచ్చారని, ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. విజయ డెయిరీకి సంబంధించి..హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. లీటర్‌కు అదనంగా రూ. 4 ఇస్తామని హామీ ఇస్తామని చెప్పిందన్నారు. 7, 8 మాసాల నుంచి రావడం లేదని పాడి పరిశ్రమకు చెందిన వారు ఆందోళన చెందుతున్నారని సభకు తెలిపారు.
ఇంటర్ మీడియట్ బోర్డుకు సంబంధించిన విషయాలు వెలుగు చూసినా..ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసిన వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిందని..రూ. 59 వేల 878 మంది దరఖాస్తు చేసుకున్నారని, రీ ఫండ్ ఏమి చేయలేదని ఇచ్చారని..వెంటనే చర్యలు తీసుకోవాలని మల్లు డిమాండ్ చేశారు.