రూ.లక్ష 65వేల కోట్ల పద్దు : నేడే తెలంగాణ బడ్జెట్

తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. లక్షా 65వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర సర్కార్ రూపొందించగా..

  • Publish Date - September 9, 2019 / 01:56 AM IST

తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. లక్షా 65వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర సర్కార్ రూపొందించగా..

తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. లక్షా 65వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర సర్కార్ రూపొందించగా.. అసెంబ్లీలో కేసీఆర్, మండలిలో హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్నారు. సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీటే వేసే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం… ఇపుడు సభ స్టార్టింగ్‌ రోజునే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో పోల్చితే ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం తగ్గుతుందన్న అంచనాతో బడ్జెట్‌లో స్వల్పంగా కోత విధించే అవకాశం ఉంది. ఉదయం 11.30గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్.. మండలిలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం పరిస్థితులున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే… రాష్ట్రంలోని ఆదాయాలతో పాటు అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన చేయాలని ఆదేశించిన కేసీఆర్… వ్యవసాయం, ప్రజాసంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఛాన్సుంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత.. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి స్పీకర్ ఆధ్వర్యంలో ఆల్‌పార్టీ సమావేశం నిర్వహిస్తారు. ఇందులో… సభ ఎన్ని రోజుల నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.

మరోవైపు… నిన్న కొత్తగా మంత్రుల ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో… పాత, కొత్త మంత్రులు పాల్గొన్నారు. రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో… 2019-20 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు కీలక అంశాలపైనా చర్చించింది.

పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పడిన తర్వాత సమావేశమైన మంత్రివర్గ భేటీలో… ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రులకు వివరించారు కేసీఆర్. మంత్రులు వారికి కేటాయించిన శాఖల వారీగా పట్టుసాధిస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందన్న సీఎం…  ప్రభుత్వపరంగా చేపడుతున్న కార్యక్రమాలు, వాటి ప్రాధాన్యతలను వివరంగా తెలియజేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదంతోపాటు.. మున్సిపల్ చట్టంపై తెచ్చిన ఆర్డినెన్స్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే… వికారాబాద్ జిల్లాను ఆలంపూర్ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌లో కలిపే తీర్మానానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు వాడివాడిగా కొనసాగే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో హాట్‌హాట్‌గా సాగనున్నాయి.