2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ సోమవారం(సెప్టెంబర్ 9) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలిలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. 2019 మార్చిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో ప్రభుత్వం సెప్టెంబర్ 9న పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.
అక్టోబర్ 2019 నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన పూర్తి బడ్జెట్‌ను ఉభయసభలు ఆమోదించాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఆవరణలో ఉభయసభల సభా వ్యవహారాల సలహా సంఘాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల పనిదినాలు, అజెండా ఖరారు కానుంది.