తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సిద్ధిపేటలోని చింతమడక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు కేసీఆర్ దంపతులు. ఓటు వేసిన అనంతరం ముఖ్యనేతలతో కొద్దిసేపు ముచ్చటించారు కేసీఆర్. ఆయన వెంట ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నారు.
మరోవైపు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు ఓటు వేసేందుకు బంజారాహిల్స్‌కు చేరుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నందీనగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్..అక్కడున్న ఓటర్లతో ముచ్చటించారు.