తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 వరకు ఎవరూ గడప దాటోద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం అనూహ్య రీతిలో జనతా కర్ఫ్యూకి స్పందించారని సీఎం కేసీఆర్ అన్నారు. ఈవిషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన చెప్పారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన సంఘీభావ సంకేతాన్ని ఐక్యతను,విజ్ఞతను తెలిపిన ప్రతి తెలంగాణ బిడ్డలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
దురదృష్ట వశాత్తు మార్చి22న చేసిన పరీక్షలో రాష్ట్రంలో 5 కేసుల్లో పాజిటివ్ వచ్చిందని… వీళ్లంతా విదేశాలనుంచి వచ్చిన వారే నని ఆయన తెలిపారు. బయట దేశాలనుంచి రాష్ట్రానికి వచ్చే విమానాలు ఈ రోజుతో ఆగిపోనున్నాయని ఇప్పటికే విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వాళ్లు పరిశీలనలో ఉన్నారని ఆయన చెప్పారు. లోకల్ గా ఒక వ్యక్తికి నిన్న వ్యాధి సంక్రమించినట్లు తెలిసిందని ఆయన తెలిపారు.తెలంగాణలో ఇప్పటి వరకు 26 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.
దురదృష్ట వశాత్తు ఈ రోజు రాష్ట్రంలో 5 కేసుల్లో పాజిటివ్ వచ్చిందని… వీళ్లంతా విదేశాలనుంచి వచ్చిన వారే నని ఆయన తెలిపారు. బయట దేశాలనుంచి రాష్ట్రానికి వచ్చే విమానాలు ఈ ఆదివారంతో ఆగిపోనున్నాయని ఇప్పటికే విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వాళ్లు పరిశీలనలో ఉన్నారని ఆయన చెప్పారు. లోకల్ గా ఒక వ్యక్తికి నిన్న వ్యాధి సంక్రమించినట్లు తెలిసిందని ఆయన తెలిపారు.తెలంగాణలో ఇప్పటి వరకు 26 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.
మనకోసం మనం… జనం కోసం జనం… అందరి కోసం అదరం.. పరితపించి చేసుకోవాల్సిన సమయం ఇదని… ఈరోజు చూపించిన క్రమ శిక్షణ పట్టుదల మార్చి 31వరకు చూపించాలని సీఎం కేసీఆర్ ప్రజలకువిజ్ఞప్తి చేశారు. ఎవరింటికి వారే పరిమితమవ్వాలని కోరారు. దీన్ని అందరూ పాటించాలని కోరారు. 1897 అత్యవసర వ్యాధులు ప్రబలినప్పుడు ఇచ్చే చట్టం కింద నోటిఫై చేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందనిఆయన చెప్పారు.
రాష్ట్రంలో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేసీఆర్. నిత్యావసరాల కోసం బయటకు వచ్చినా కుటుంబంలోంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని, 5 గురికి మించి ఒక చోట గూమి కూడవద్దని సీఎం కోరారు. ఒకవేళ నిత్యావసరాలకోసం బయటకు వచ్చినా మనిషికి మనిషికి 3 అడుగుల దూరం పాటించమని ఆయన కోరారు.
పేదలందరికీ ఇంటి అవసరాల కోసం నిత్యావసర వస్తుల కోసం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలి.. ఎవరికి వారు స్వచ్ఛందంగా నిబంధన పాటించాలని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఆకలికి గురికాకుండా ఒక నెల రోజులకు సరిపడా రేషన్ ఉచితంగా అందచేస్తమని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని 87.59 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రతి వ్యక్తికి ఉచితంగా 12 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాల కోసం రూ.1500 నగదు అందచేస్తామని ఆయన చెప్పారు.
See Also | కరోనా VS ఇండియా : 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు చేసిన ఢిల్లీ ప్రభుత్వం