టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ(25 జనవరి 2020) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా రెపరెపలాడడంతో ఆయన మీడియా ముందుకు రానున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కారు జోరు కొనసాగగా.. ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. మొత్తం 120 మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ పార్టీ 109 మున్సిపాలిటీల్లో ముందంజలో ఉంది.
కొన్ని మున్సిపాలిటీల్లో అయితే టీఆర్‌ఎస్ ఏకపక్ష విజయం సాధించింది. 9 కార్పొరేషన్లకు గానూ 5 కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్ లీడ్‌లో ఉంది. ఎక్కడా కూడా టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పోటీ ఇవ్వలేకపోయాయి.