కొత్త మాస్టార్లు వస్తున్నారు : ఎస్జీటీ పోస్టుల నియామక షెడ్యూల్ విడుదల

  • Publish Date - October 22, 2019 / 02:36 AM IST

తెలంగాణ రాష్ట్రంలో తెలుగు మీడియంలో ఎస్జీటీ  (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టుల నియామకాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు 3,325 మందిని టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. కోర్టు కేసులు, ఇతర అడ్డంకుల కారణంగా ఇన్నాళ్లు నియామకాల ప్రక్రియ ఆలస్యం అయ్యింది. ఇటీవలే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో టీ.ఎస్.పీ.ఎస్సీ. ఎంపికైన అభ్యర్దుల జాబితాను విద్యాశాఖ అధికారులకు అందచేసింది. అక్టోబరు 23 నుంచి 30వ తేదీ వరకు నియామక కౌన్సెలింగ్ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది.

టీఆర్టీలో ఎస్జీటీ తెలుగు మీడియంలో 3,786 పోస్టులకు 3,325 మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. 117 పోస్టులకు ఎంపిక పూర్తిచేసినప్పటికీ కోర్టు వివాదం కారణంగా వాటిని ప్రకటించలేదు. ఇప్పటికే టీఆర్టీకి సంబంధించి స్కూల్‌అసిస్టెంట్లు, భాషాపండితుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్‌ ఇచ్చారు.

షెడ్యూల్ ఇలా…
అక్టోబరు 23 : జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్దుల జాబితాను వెబ్ సైట్లో ఉంచుతారు. జిల్లాల్లో ఖాళీలను గుర్తిస్తారు.
అక్టోబరు 25,26 :   అభ్యర్దుల అసలు ధృవీకరణ పత్రాలు పరిశీలన
అక్టోబరు 28,29 : పోస్టింగ్ ఉత్తర్వులు అందచేస్తారు.
అక్టోబరు 30 :  పోస్టింగ్ అందుకున్నవారు పాఠశాలల్లో చేరాలి.