గాంధీ ఆస్పత్రిలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఆస్పత్రిలో అక్రమాలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం (ఫిబ్రవరి 15, 2020) నిర్వహించనున్నారు.
గాంధీ ఆస్పత్రిలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఆస్పత్రిలో అక్రమాలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం (ఫిబ్రవరి 15, 2020) నిర్వహించనున్నారు. అధికారుల తీరుపై ఈటెల ఆగ్రహంగా ఉన్నారు. డాక్టర్ వసంత్ కుమార్ చేస్తున్న ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. ఇవాళ వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో అన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల వివాదం ముదురుతోంది. డాక్టర్ వసంత్‌పై సూపరింటెండెంట్ శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రోగుల నుంచి షాపుల నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వసంత్‌పై ఆరోపణలు చేశారు శ్రవణ్. దీనికి సంబందించిన ఆడియో, వీడియో టేపులను సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ బయటపెట్టారు. డాక్టర్ వసంత్‌కు ఓ విద్యార్థికి మధ్య జరిగిన పోన్ సంబాషణను సూపరింటెండెంట్ విడుదల చేశారు. వసంత్‌కు మతిస్థిమితం లేదని సూపరింటెండెంట్ శ్రవణ్ అన్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం సూసైడ్ హై డ్రామా చోటు చేసుకుంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ గురించి దుష్ప్రచారం చేశారనే ఆరోపణలతో సీఎంఓ గా పనిచేస్తున్న డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. శనివారం ఆయన్ను సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం తన పర్సనల్ మెయిల్ చెక్ చేసుకున్న డాక్టర్ వసంత్ ఉన్నతాధికారులను సంప్రదించగా వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు.
మంగళవారం, పిబ్రవరి 11 ఉదయం వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కలిసినప్పటికీ ఆయన నుంచి కూడా తన సస్పెన్ష్ పై స్పష్టమైన హామీ రాకపోవటంతో సూసైడ్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఒంటికి రెండు పెట్రోల్ బాటిల్స్ కట్టుకుని…లైటర్ చేతపట్టుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో గాంధీ ఆస్పత్రికి వచ్చారు. దాదాపు గంటసేపు ఆయన అస్పత్రిలో జరుగుతున్న అవినీతిని ఏకరువు పెట్టారు. పోలీసులు, ఆస్పత్రివైద్యుల సంఘం నాయకులు, సహచర వైద్యులు ఎంత నచ్చచెప్పినా ఆయన అందరినీ బెదిరిస్తూ గంటకుపైగా వీరంగం సృష్టించారు.
ఆస్పత్రిలో శానిటేషన్ లోనూ, సెక్యూరిటీ లోనూ ఇలా ప్రతి విషయంలోనూ అవినీతి పెరిగి పోయిందని….. ఈ.ఎస్.ఐ. కంటే పెద్ద స్కాం గాంధీలో జరుగుతోందని ఆరోపణలు చేశారు. గాంధీ ఆస్పత్రి లో జరుగుతున్నఅనేక అక్రమాలను బయట పెడుతున్నందుకే తనపై వేటు వేశారని వసంత్ ఆరోపించారు. తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ నాయకుడిగా ఉన్న తనకే న్యాయం జరగటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ చేసుకోటానికి యత్నించారు. చేయని తప్పులకు తనపై సూపరింటెండెంట్ ఆరోపణలు చేస్తూ తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. డాక్టర్ వసంత్ భార్య జ్యోతిర్మయి గైనకాలజి డిపార్ట్ మెంట్లో అసిస్టెంట్ ప్రోఫెసర్ గా పని చేస్తున్నారు.
అస్పత్రిలో జరిగిన అవినీతిని విలేకరులతో చెపుతుండగా పోలీసులు చాకచక్యంగా అతనిపై పడి చేతిలోని లైటర్ లాగేసి…ఒంటికి కట్టుకున్న పెట్రోల్ బాటిల్స్ తీసివేసారు. ఒంటిపై ఒక్కసారిగా నీళ్లు పోసి ప్రమాదం తప్పించారు. గంటకు పైగా సాగిన ఉత్కంఠకు తెర దింపారు. అనంతరం డాక్టర్ వసంత్ నుచిలకులగూడా పోలీసు స్టేషన్ కు తరలించారు.
Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు