బ్రేకింగ్ : ఢిల్లీ నుంచి తెలంగాణ గవర్నర్ కి పిలుపు.. చర్చించే అంశం అదేనా

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆర్టీసీ సమ్మె రాజకీయ మలుపు తిరుగుతోంది. సమ్మె ఎపిసోడ్ లో కొత్త సీన్ తెరపైకి వచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కేంద్రం నుంచి

  • Publish Date - October 15, 2019 / 05:45 AM IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆర్టీసీ సమ్మె రాజకీయ మలుపు తిరుగుతోంది. సమ్మె ఎపిసోడ్ లో కొత్త సీన్ తెరపైకి వచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కేంద్రం నుంచి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆర్టీసీ సమ్మె రాజకీయ మలుపు తిరుగుతోంది. సమ్మె ఎపిసోడ్ లో కొత్త సీన్ తెరపైకి వచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఢిల్లీ రావాలని పీఎం ఆఫీస్ వాళ్లు ఫోన్ చేశారు. దీంతో తమిళిసై హస్తినకు పయనం అయ్యారు. మ. 3 గంటలకు ప్రధాని మోడీతో గవర్నర్ తమిళిసై భేటీ కానున్నారు. ఆ తర్వాత సా.4 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు.

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి ప్రధాని, హోంమంత్రి.. గవర్నర్ తో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె గురించి ఆరా తీస్తారని వార్తలు వస్తున్నాయి. సమ్మెపై గవర్నర్ తమిళిసై ఓ నివేదికను కేంద్రం పెద్దలకు ఇవ్వనున్నారని సమాచారం. అలాగే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు గవర్నర్ తమిళిసై.

ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ ని కలిశారు. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఢిల్లీ నుంచి గవర్నర్ కి పిలుపురావడంతో.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఏం జరగనుంది అని అన్ని పార్టీలు వాళ్లు ఉత్కంఠగా చూస్తున్నారు.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో కార్మికులు సమ్మెని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వైఖరితో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్టీసీ స్ట్రైక్ కి ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్.. ఆర్టీసీ జేఏసీకి అండగా నిలిచాయి. మరీ ముఖ్యంగా బీజేపీ నేతలు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.